![]() |
![]() |

కమెడియన్ గా తేజ గురించి అందరికీ తెలుసు మరి ఏంటి అందరూ టేస్టీ తేజా అంటారు..ఎలా ఆ పేరు వచ్చింది అని అడిగేసరికి దాని హిస్టరీ మొత్తం చెప్పుకొచ్చాడు తేజ ఒక ఇంటర్వ్యూలో. "టేస్టీ తేజ అనేది నా యూట్యూబ్ ఛానల్ పేరు. ఇందులో సినీ సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను షెఫ్ ని కూడా.. రకరకాల ఫుడ్ కూడా వండుతాను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం నాలుగు భాషలకు సంబంధించి 150 కి పైగా యాక్టర్స్ తో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ ని నేను. డైరెక్టర్స్, యాక్టర్స్, కమెడియన్స్, సింగర్స్ తో అందరితో ఇంటర్వ్యూస్ చేశా. అలాగే తెలుగు ఇండస్ట్రీ 90 ప్లస్ మూవీస్ ని ప్రమోట్ చేశా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. అసలు ఈ ఐడియా నాకు రావడం నేను దాన్ని అమలు చేయడం అది క్లిక్ అవడం లక్ అని చెప్పాలి.
మొదట్లో నాకు జబర్దస్త్ లో అదిరే అభి ఒక అవకాశం ఇచ్చారు. అన్న టీమ్ లో 8 వ వాడిగానో 9 వాడిగానో ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత కమెడియన్ గా తేజ అనే వాడు జబర్దస్త్ లో చేస్తున్నాడు అనే విషయం జనాలకు తెలియడానికి రెండేళ్లు పట్టింది. 2016 లో అభి అన్న టీమ్ లో చేశా. 2018 లో తేజ అంటూ నేనొకడ్ని ఉన్నాను అనే విషయం అందరికీ తెలిసింది. ఒక టీమ్ లో చేస్తున్నప్పుడు నేను జనాలకు తెలియడానికి రెండేళ్లు పట్టింది అప్పుడు నాకు ఇండివిడ్యువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెంత టైం పడుతుందో అనుకున్నా. ఆ టైంలో కూడా నేను టిసిఎస్ లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా జాబ్ చేస్తూ ఉన్నాను. అలా జాబ్ చేస్తూ జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ మేనేజ్ చేసేవాడిని. అప్పుడు నా ఇండివిడ్యువల్ ఐడెంటిటీ కోసం ఎం చేయాలా అని ఆలోచిస్తుండగా అప్పుడే యూట్యూబ్ బూమ్ కొంచెంకొంచెంగా స్టార్ట్ అయ్యింది. నాకు యూట్యూబ్ ఫ్రెండ్ మహీధర్ అని వున్నాడు. యూట్యూబ్ లో ఏదో ఒకటి చెయ్యమని చెప్పాడు. అప్పుడు ఫుడ్ వీడియోస్ చేద్దామని ఐడియా వచ్చింది. నేనొక్కడినే తింటూ వీడియోస్ చేస్తే ఎవరూ చూడరు అనిపించి మొదట నా ఫ్రెండ్స్ ని అటు ఇటు కూర్చోబెట్టుకుని వీడియోస్ చేయడం స్టార్ట్ చేశా. అవి బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యువి క్రియేషన్స్ నుంచి గీత ఆర్ట్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి వాళ్ళ మూవీ ప్రమోషన్స్ చేయాలనీ పిఆర్వోలు అడగడం అలా స్టార్ట్ అయ్యింది నా యూట్యూబ్ జర్నీ. అది కాస్తా బిగ్ బాస్ 7 వరకు తీసుకెళ్లింది. ఇప్పుడు బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా అవకాశం ఇచ్చేలా చేసింది." అని చెప్పాడు తేజ.
![]() |
![]() |